ప్రియ యేసు మన కొరకు Song Lyrics

ప్రియ యేసు మన కొరకు
ప్రేమతో పొందిన శ్రమలు
కాంచగ కల్వరి దృశ్యం
కారెను కళ్ళలో రుధిరం (2) ||ప్రియ యేసు||

కల్వరి కొండపైన
దొంగాల మధ్యలోన
సిల్వలోన వ్రేలాడెను
నాకై యేసు మరణించెను (2) ||ప్రియ యేసు||

ముండ్లతో అల్లిన మకుటం
జల్లాటమున పెట్టగా
స్రవించె పరిశుద్ధ రక్తం
ద్రవించె నా హృదయం (2) ||ప్రియ యేసు||

పాపాంధకారములో
పయనించు మనుజులను
పావనులుగా చేయుటకు
పావనుడేసు మరణించెను (2) ||ప్రియ యేసు||

పాపినైన నా కొరకు
ప్రేమించి ప్రాణమిచ్చెను
సిల్వలో వ్రేళాడెను
నీకై ప్రాణమునిచ్చెను (2) ||ప్రియ యేసు||

ప్రియ యేసు మన కొరకు telugu christian video song


ప్రియ యేసు మన కొరకు Song Lyrics