ప్రియ యేసు రాజును Song Lyrics

ప్రియ యేసు రాజును నే చూచిన చాలు
మహిమలో నేనాయనతో ఉంటే చాలు (2)
నిత్యమైన మోక్షగృహము నందు చేరి
భక్తుల గుంపులో హర్షించిన చాలు (2) ||ప్రియ యేసు||

యేసుని రక్తమందు కడుగబడి
వాక్యంచే నిత్యం భద్రపరచబడి (2)
నిష్కలంక పరిశుధ్దులతో పేదన్ నేను (2)
బంగారు వీదులలో తిరిగెదను (2) ||ప్రియ యేసు||

ముండ్ల మకుటంబైన తలను జూచి
స్వర్ణ కిరీటం బెట్టి ఆనందింతున్ (2)
కొరడాతో కొట్టబడిన వీపున్ జూచి (2)
ప్రతి యొక్క గాయమును ముద్దాడెదన్ (2) ||ప్రియ యేసు||

హృదయము స్తుతులతో నింపబడెను
నా భాగ్య గృహమును స్మరించుచు (2)
హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ (2)
వర్ణింప నా నాలుక చాలదయ్యా (2) ||ప్రియ యేసు||

ఆహ ఆ బూర ఎప్పుడు ధ్వనించునో
ఆహ నా ఆశ ఎప్పుడు తీరుతుందో (2)
తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో (2)
ఆశతో వేచియుండే నా హృదయం (2) ||ప్రియ యేసు||

ప్రియ యేసు రాజును telugu christian video song