భూమ్యాకాశములు సృజించిన Song Lyrics

భూమ్యాకాశములు సృజించిన
యేసయ్యా నీకే స్తోత్రం (2)
నీ ఆశ్ఛర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును (2)
హల్లెలూయ లూయ హల్లెలూయా (4)

బానిసత్వమునుండి శ్రమల బారినుండి విడిపించావు నన్ను
దీన దశలో నేనుండగా నను విడువవైతివి (2) ॥భూమ్యాకాశములు॥

జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను
ఆకలితో అల్లాడగా నను తృప్తిపరచితివి (2) ॥భూమ్యాకాశములు॥

భుజంగములను అణచివేసి కాచినావు నన్ను
ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి (2) ॥భూమ్యాకాశములు॥

నూతన యెరూషలేం నిత్యనివాసమని తెలియజేసితివి
నిట్టూర్పులలో ఉండగా నను ఉజ్జీవ పరచితివి (2) ॥భూమ్యాకాశములు॥

భూమ్యాకాశములు సృజించిన telugu christian video song


భూమ్యాకాశములు సృజించిన Song Lyrics