మార్గము నీవని – గమ్యము నీవని –(2)
నమ్మితి గనుక ఓ యేసు నాథా
సుగమమాయెనే జీవ యాత్ర
ప్రాణము నీవని – దేహము నీదని –(2)
నమ్మితి గనుక ఓ యేసు నాథా
చైతన్యమొందెనే జీవ యాత్ర
బాధల బరువులో – నిత్య నిరాశలో
శోధన వేళలో సత్య సాక్ష్యమునీయగా (2)
శాంతము నీవని – స్వస్థత నీవని (2)
నమ్మితి గనుక ఓ యేసు నాథా
ఆనందమాయెనే జీవ యాత్ర ||మార్గము||
ప్రార్థన వేళలో – ఆద్రత మీరగా
గొంతు మూగదై – భక్తి కన్నుల జాలగా (2)
ధాత్రము నీవని – స్తోత్రము నీవని (2)
నమ్మితి గనుక ఓ యేసు నాథా
సంగీతమాయెనే జీవ యాత్ర ||మార్గము||