మా ఊహలు పుట్టక మునుపే – మా సర్వమునెరిగిన దేవా (2)
ఇహపరములలో నీవే – మా కోర్కెలు తీర్చెడి ప్రభువా (2)
విశ్వాస నిరీక్షణతో – కనిపెట్టియున్నచో (2)
పొందెదము ఎన్నో మేలులూ – ప్రభువా నీ పాద సన్నిధిలో (2) ||మా ఊహలు||
నిన్నడుగకుండగనే – మోషేను పిలచితివి
నిన్నడిగిన సొలోమోనుకు – జ్ఞాన సిరుల నొసగిన దేవా (2)
పలు సమయముల యందు – పలు వరముల నిచ్చితివి (2)
అడుగనేల ప్రభువా ఈ ధరలో – నీ దివ్య కృపయే చాలు ||మా ఊహలు||
ప్రార్ధించుచుంటిమి – సమస్యలు తీర్చమని
నిన్నడుగుచున్నాము నీ – రాజ్యములో చోటిమ్మని (2)
ఊహించు వాటికంటె – అధికముగా నిచ్చెడి దేవా (2)
ఇంతకంటె మాకేమి వలదు – నీ తోడు నీడే చాలు ||మా ఊహలు||