మెల్లని స్వరమే వినిపించావే
చల్లని చూపుతో దీవించినావే
వాక్యపు ఒడిలో లాలించినావే
ఆత్మీయ బడిలో నన్ను పెంచినావే
నీ మెల్లని స్వరమే చల్లని చూపే నాకు పది వేలయా
నీ మెల్లని స్వరమే చల్లని చూపే నాకు సుభాగ్యమయా (2) ||మెల్లని||
తీయని గీతాన్ని వినిపించాలని
చల్లని వేళలో నిను నేను చేరితిని
అమృత రాగాన్ని వినిపించాలని
చల్లని వేళలో నిను నేను చేరితిని (2)
నాకంటే ముందుగా నీవొచ్చినావే
నీ మాట నా పాటగా మార్చేసినావే (2) ||మెల్లని||
కృంగిన కాలములో వేదనల వేళలో
సోమసిన సమయములో నిను నేను చేరితిని (2)
నా గాథ అంతయు గమనించినావే
నా గుండె మంటలను ఆర్పేసినావే (2) ||మెల్లని||