యవ్వనా జనమా Song Lyrics

యవ్వనా జనమా
ప్రభు యేసులో త్వరపడుమా (2)
సమర్పించుము నీ యవ్వనము (2)
ప్రభు యేసుని పాదములో (2) ||యవ్వనా||

యవ్వనమనునది విలువైనది
కదలిపోతే తిరిగి రాదు
యవ్వనమందే మన కర్తను
స్మరించుమూ కీర్తించుమూ
ప్రభు యేసులో జీవమును పొందుమూ ||యవ్వనా||

ఈ లోకము వైపు మనసు ఉంచకు
క్షనికమైనదీ దాని మెరుపులు
నీ మనసా వాచా క్రియలందును
ప్రభు యేసును మది నిలుపుకో
పరలోకపు ఆనందమును పొందుమూ ||యవ్వనా||

యవ్వనా జనమా telugu christian video song