యవ్వనులారా మీరు Song Lyrics

యవ్వనులారా మీరు – ప్రభు నొద్దకు రండి
సమృద్ధియైన జీవము నొందుటకు – (2)
ఆహాహా హల్లెలూయా – (6)

ప్రభు యేసు మన కొరకు
సిలువపై బలియాయెను (2)
మీ పాపమునొప్పుకొనిన (2)
క్షమియించి నూతన జీవమునిచ్చున్ (2) ||ఆహాహా||

ప్రభు యేసుని స్వరమును వినుచు
ఆ ప్రభుని వెంబడించిన (2)
కాపాడును దుష్టుని నుండి (2)
నడిపించు నిన్ను అంతము వరకు (2) ||ఆహాహా||

చేపట్టి జీవ వాక్యము
జ్యోతుల వలె ఇహమందున (2)
ప్రభు కొరకు ప్రకాశించుచు (2)
ప్రకటింతురు ప్రభు యేసుని సువార్తను (2) ||ఆహాహా||

నిజ ఆహారా పానీయం
ప్రభు యేసు క్రీస్తే కాగా (2)
ఆయననే తిని త్రాగుచూ (2)
ఆ జీవముతో మనము జీవించెదము (2) ||ఆహాహా||

మృతి నొందిన మనమందరము
పై వాటినే వెంటాడెదం (2)
మన జీవము వృద్ధి నొందుచూ (2)
ప్రభు యేసుని మహిమను పొందెదము (2) ||యవ్వనులారా||

యవ్వనులారా మీరు telugu christian video song


యవ్వనులారా మీరు Song Lyrics