యెహోవా మహిమ నీ మీద ఉదయించెను
తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును (2)
ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది
అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది (2)
లెమ్ము నీవు తేజరిల్లుము
ప్రభువు కొరకు ప్రకాశించుము (2)
చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది
జీవ వాక్యము చేబూని జ్యోతివలే లెమ్ము (2)
జనములు నీ వెలుగునకు పరుగిడి వచ్చెదరు
రాజులు నీ ఉదయకాంతికి త్వరపడి వచ్చెదరు (2) ||లెమ్ము||
ఒంటరియైన వాడు వేయి మంది అగును
ఎన్నిక లేని వాడు బలమైనట్టి జనమగును (2)
ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును
నీ దుఃఖదినములు సమాప్తమగునని ప్రభువు సెలవిచ్చెను (2) ||లెమ్ము||