యేసయ్యా నిన్ను ప్రేమించువారు
బలమైన సూర్యుని వలెనె ఉదయించెదరు నిత్యము (2)
శాశ్వత కాలం నీతోనే నివసింతురు (2) ||యేసయ్య||
నిన్ను ప్రేమించువారు
సకలమైన ఉపద్రవముల నుండి (2)
నిర్దోషులై కాపాడబడెదరు
అపవాది అగ్ని బాణముల నుండి (2) ||యేసయ్య||
నిన్ను ప్రేమించువారు
దేవ దూతల జ్ఞానమును కలిగుందురు (2)
సమకూడి జరుగును సమస్తము
సదా మాతో ఉన్నందున (2) ||యేసయ్య||
నిన్ను ప్రేమించువారిని
ఎవ్వరునూ ద్వేషించి జయమొందలేరు (2)
మా ప్రక్క నిలిచి సింహాల నోటి నుండి
తప్పించి బలపరచినావు (2) ||యేసయ్య||
నిన్ను ప్రేమించువారి
చేతులకు వారి శత్రువుల నప్పగింతువు (2)
వారి కాలమంతట దేశమంతయు
నెమ్మదిగా నుండును (2) ||యేసయ్య||