యేసు రక్తమే జయము జయమురా
సిలువ రక్తమే జయము జయమురా
ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా
తన పక్షము నిలబడిన గెలుపు నీదేరా (2) ||యేసు||
బలహీనులకు బలమైన దుర్గము – ముక్తి యేసు రక్తము
వ్యాధి బాధలకు విడుదల కలిగించును – స్వస్థత యేసు రక్తము (2)
శాంతికి స్థావరం శ్రీ యేసుని రక్తం
నీతికి కవచం పరిశుద్ధుని రక్తం (2)
మృత్యువునే గెలుచు రక్తము
పాతాలం మూయు రక్తము
నరకాన్ని బంధించిన
జయశీలి అధిపతి రారాజు యేసయ్యే ||యేసు||
పాపికి శరణం యేసు రక్తము – రక్షణ ప్రాకారము
అపవిత్రాత్మను పారద్రోలును – ఖడ్గము యేసు రక్తము (2)
శత్రువు నిలువడు విరోధి ఎవ్వడు?
ఏ ఆయుధము నీపై వర్ధిల్లదు (2)
సాతాన్నే నలగ్గొట్టిన
వాడి తలనే చితగ్గొట్టిన
కొదమ సింహమై మేఘారూఢిగా
తీర్పు తీర్చవచ్చు రారాజు యేసయ్యే ||యేసు||