వర్ణించలేను Song Lyrics

వర్ణించలేను వివరించలేను
అతి శ్రేష్టమైన నీ నామమున్
యేసు నీ నామమున్ – (2)
కొనియాడెదన్ కీర్తించెదన్ (2)
అత్యంతమైన నీ ప్రేమను
యేసు నీ ప్రేమను (2) ||వర్ణించలేను||

మహోన్నతుడ నీవే – పరిశుద్ధుడ నీవే
పాపినేని చూడక ప్రేమించితివే (2)
హల్లెలూయా హల్లెలూయా (2)
అర్పింతు స్తుతులను ఆరాధ్యుడా (2) ||వర్ణించలేను||

సర్వాధికారి సర్వోన్నతుడా (2)
హీనుడైన నన్ను కరుణించితివే (2)
హల్లెలూయా హల్లెలూయా (2)
అర్పింతు స్తుతులను ఆరాధ్యుడా (2) ||వర్ణించలేను||

రత్న వర్ణుడవు అతి సుందరుడవు (2)
నీ మహిమ నాకిచ్చి వెలిగించితివే (2)
హల్లెలూయా హల్లెలూయా (2)
అర్పింతు స్తుతులను ఆరాధ్యుడా (2) ||వర్ణించలేను||

వర్ణించలేను telugu christian video song


వర్ణించలేను Song Lyrics