వాటి వాటి కాలమున Song Lyrics

వాటి వాటి కాలమున అన్నిటిని
అతి మనోహరముగా చేయువాడా (2)
యేసయ్యా.. యేసయ్యా..
నా దైవం నీవేనయ్యా (2) ||వాటి వాటి||

ఆశ భంగం కానేరదు
మంచి రోజు ముందున్నది (2)
సత్క్రియను ఆరంభించెను
ఎటులైన చేసి ముగించును (2)
(నే) రూఢిగా నమ్ముచున్నాను
ఎటులైన చేసి ముగించును (2) ||యేసయ్యా||

అద్భుతములు చేసెదను
నీ తోడుంటానంటివి (2)
నా ప్రజల ఎదుట నీవు
(నను) హెచ్చింప చేసెదవు (2)
(నే) రూఢిగా నమ్ముచున్నాను
హెచ్చింప చేసెదవు (2) ||యేసయ్యా||

ఇప్పుడున్న వాటి కంటే
వెయ్యి రెట్లు చేసెదవు (2)
ఆకాశ తార వలె
భువిలో ప్రకాశింతును (2)
(నే) రూఢిగా నమ్ముచున్నాను
భువిలో ప్రకాశింతును (2) ||యేసయ్యా||

వాటి వాటి కాలమున telugu christian video song


వాటి వాటి కాలమున Song Lyrics