వాడిపోకముందే Song Lyrics

వాడుకో… యేసయ్యా….
పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో యేసయ్యా
నీ కాడి నే మోస్తానయ్యా – (2)

వాడిపోకముందే నన్ను వాడుకో
పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో (2)
వాడుకో యేసయ్యా – నీ కాడి నే మోస్తా (2) ||వాడిపోక||

నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యము కాకముందే
నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చి పోకముందే (2) ||వాడుకో||

నీవిచ్చిన జీవితానికి వెలుగులింక పోకముందే
నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే (2) ||వాడుకో||

నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముందే
నా దినముల పరిమాణం సంపూర్ణం కాకముందే (2) ||వాడుకో||

నీవిచ్చిన ఆరోగ్యం ఆవిరిగా మారకముందే
నాకున్న అవకాశం చేజారి పోకముందే (2) ||వాడుకో||

వాడిపోకముందే telugu christian video song


వాడిపోకముందే Song Lyrics