విధేయతకే అర్ధము చెప్పిన Song Lyrics

విధేయతకే అర్ధము చెప్పిన వినయ మనస్కుడా
విధేయులుగా ఉండ మాదిరి చూపిన మనుజ కొమరుడా
అవిధేయత తొలగించుమయ్యా
నీ దీన మనస్సు కలిగించుమయ్యా (2) ||విధేయతకే||

పరిచర్య చేయుటకే ధరణికి వచ్చిన త్యాగమూర్తివి
ప్రతి చర్య జరిగించక పగవారిని క్షమియించిన ప్రేమ దీప్తివి(2)
సిలువ మరణము పొందునంతగా నీవే తగ్గించుకొంటివి (2)
అధికముగా హెచ్చింపబడితివి (2) ||అవిధేయత||

పరిపూర్ణమైన భయ భక్తులతో తండ్రికి లోబడితివి
ప్రతి విషయములో పంపిన వాని చిత్తము నెరవేర్చితివి (2)
శ్రమలు పొంది యాజకుడని దేవునిచే పిలువబడితివి (2)
రక్షణకు కారకుడవైతివి (2) ||అవిధేయత||

విధేయతకే అర్ధము చెప్పిన telugu christian video song


విధేయతకే అర్ధము చెప్పిన Song Lyrics