సన్నుతింతుమో ప్రభో Song Lyrics

సన్నుతింతుమో ప్రభో
సదమలమగు భక్తితో (2)
కన్న తండ్రి కావుమా (2)
కలుషము నెడబాపుమా ||సన్నుతింతుమో||

నీతి సూర్య తేజమా
జ్యోతి రత్న రాజమా (2)
పాతక జన రక్షకా (2)
పతిత పావన నామకా ||సన్నుతింతుమో||

మానవ సంరక్షకా
దీన నిచయ పోషకా (2)
దేవా మానవ నందనా (2)
దివ్య సుగుణ మందనా ||సన్నుతింతుమో||

ప్రేమ తత్వ బోధకా
క్షేమ దాత వీవెగా (2)
కామిత ఫలదాయక (2)
స్వామి యేసు నాయక ||సన్నుతింతుమో||

పాప చింతలన్నిటిన్
పారదోలుమో ప్రభో (2)
నీ పవిత్ర నామమున్ (2)
నిరతము స్మరియించెదన్ ||సన్నుతింతుమో||

సన్నుతింతుమో ప్రభో telugu christian video song


సన్నుతింతుమో ప్రభో Song Lyrics