సిలువలో సాగింది యాత్ర Song Lyrics

సిలువలో సాగింది యాత్ర
కరుణామయుని దయగల పాత్ర (2)

ఇది ఎవరి కోసమో
ఈ జగతి కోసమే
ఈ జనుల కోసమే ||సిలువలో||

పాలు కారు దేహము పైన
పాపాత్ముల కొరడాలెన్నో (2)
నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి (2)
నోరు తెరువ లేదాయే ప్రేమ
బదులు పలుక లేదాయే ప్రేమ (2) ||ఇది ఎవరి||

వెనుక నుండి తన్నింది ఒకరు
తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు (2)
గేలి చేసినారు పరిహాసమాడినారు (2)
నోరు తెరువ లేదాయే ప్రేమ
బదులు పలుక లేదాయే ప్రేమ (2) ||ఇది ఎవరి||

సిలువలో సాగింది యాత్ర telugu christian video song


సిలువలో సాగింది యాత్ర Song Lyrics