హల్లెలూయ పాటలతో Song Lyrics

హల్లెలూయ పాటలతో
ఆనంద గీతాలతో (2)
కృపామయుండా నీ మేలులన్ని
స్మరించి స్తుతింతును (2)

నేనారణ్యా యానములో
నిను పలుమార్లు విసిగించినా (2)
కోపించుచునే వాత్సల్యము చూపి
అనుదినము నను మరువక
మన్నాను నాకిడితివి (2) ||హల్లెలూయ||

మలినంబైన వలువలతో
నే నీ ఎదుట నిలుచుండగా (2)
కృపతో నా నేరములను క్షమియించి
పరిశుద్ధ వస్త్రములతో
నన్నలంకరించితివి (2) ||హల్లెలూయ||

నే కృంగిన వేళలలో
నీ అభిషేక తైలముచే (2)
పక్షిరాజు యవ్వనము వలె నా బలము
నూతనము జేసితివి
నను పైకెగుర జేసితివి (2) ||హల్లెలూయ||

హల్లెలూయ పాటలతో telugu christian video song


హల్లెలూయ పాటలతో Song Lyrics