మార్పు చెందవా నీవు మార్పు Marpu Chendava Neevu Marpu Latest Telugu Christian Songs

మార్పు చెందవా నీవు మార్పు Marpu Chendava Neevu Marpu Latest Telugu Christian Songs

మార్పు చెందవా నీవు మార్పు చెందవా
నీ బ్రతుకు మార్చుకోవా….
నీ బ్రతుకు మార్చుకోవా
అనుకూల సమయం ఇదియేనని యెరిగి
మారు మనసును పొందవా….
మారు మనసును పొందవా

ఎన్నాళ్ళు నీవు జీవించినా గానీ
ఏమున్నది ఈ లోకంలో
ఇన్నేళ్లు నీవు చేసిన క్రియలన్నిటికి
తీర్పున్నది పై(పర)లోకంలో
తీర్పు దినమునందున
ఆయన ముందర నీకు
నిలిచే ధైర్యం నీకుందా

దిగంబరిగానే వచ్చావు నీవు
దిగంబరిగా పోతావు
మన్నైన నీవు మన్నైపోతావు
ఏదో ఒక దినమందున
నీ ఆస్తి అంతస్తు నీ అందచందాలు
నీ వెంట రావెన్నడు